Politics19th Jan 04:42 PMSunil Byrisetty1 min read

బండి నడుస్తున్నప్పుడే కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి

వాహనం బాగా నడుస్తున్న సమయంలోనే పాత తరం క్రమంగా తప్పుకోవాలని, కొత్త తరం బాధ్యతలను స్వీకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగపూర్ లో జరిగిన 'అడ్వాంటేజ్ విదర్భ ఆధ్యోగిక్ మ

బండి నడుస్తున్నప్పుడే కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి
వాహనం బాగా నడుస్తున్న సమయంలోనే పాత తరం క్రమంగా తప్పుకోవాలని, కొత్త తరం బాధ్యతలను స్వీకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగపూర్ లో జరిగిన 'అడ్వాంటేజ్ విదర్భ ఆధ్యోగిక్ మహోత్సవ్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అడ్వాంటేజ్ విదర్భ ఇనిషియేటివ్ లో ఆశిష్ కాలే కీలక పాత్రను పోషిస్తున్నారని కొనియాడారు. కొత్త తరానికి అవకాశం కల్పిస్తూ తాము క్రమంగా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు. వాహనం బాగా నడుస్తున్నప్పుడే కొత్త తరానికి బాధ్యతలను అప్పగించాలని అన్నారు. బాధ్యతల నుంచి పాత తరం తప్పుకుని కొత్త పనుల్లో నిమగ్నమవ్వాలని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతున్న సందర్భంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
Indian Politics
Nitin Gadkari
Union Minister
Advantage Vidarbha
Nagpur
BJP
Leadership Transition
New Generation Leadership
Scroll for the next article