Politics20th Jan 12:09 PMSunil Byrisetty1 min read

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్

భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం 45 ఏళ్ల వయసులోనే ఈ ప్రతిష్టాత్మక బాధ్యతను చేపట్టి, బీజేపీ చరిత్రలోనే 'అతి పిన్న వయస్కుడైన జాత

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్
భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం 45 ఏళ్ల వయసులోనే ఈ ప్రతిష్టాత్మక బాధ్యతను చేపట్టి, బీజేపీ చరిత్రలోనే 'అతి పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా' ఆయన రికార్డు సృష్టించారు. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా తర్వాత, పార్టీ పగ్గాలు చేపట్టిన నితిన్ నబిన్ బీహార్‌కు చెందినవారు. పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుండి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం. యువ మోర్చా నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, బీహార్ రాష్ట్ర మంత్రిగా, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు.
National politics
Bharatiya Janata Party
BJP National President
Nitin Nabin
JP Nadda
Youngest BJP President
Bihar Politics
ఐదు సార్లు ఎమ్మెల్యే
యువ మోర్చా
బీజేపీ నాయకత్వం
జాతీయ రాజకీయాలు
Scroll for the next article