Education6th Nov 03:39 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు

రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 161 కొత్త పీజీ వైద్య సీట్లను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. మొత్తం 15 స్పెషాలిటీల్లో ఈ సీట్లు వచ్

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు
రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 161 కొత్త పీజీ వైద్య సీట్లను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. మొత్తం 15 స్పెషాలిటీల్లో ఈ సీట్లు వచ్చాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి 163 సీట్లకు ప్రతిపాదనలు పంపగా ఎన్ఎంసీ 161 సీట్ల (98.77 శాతం)కు అనుమతించింది. కూటమి ప్రభుత్వం సదరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధనా సిబ్బంది నియామకాలు, పడకల పెంపు, వైద్య పరికరాలు, మౌలిక వసతులను కల్పించడం ద్వారా 161 సీట్లు అదనంగా రావడంతో మెరిట్ విద్యార్థులకు పీజీ వైద్య విద్య మరింత చేరువైంది. వైద్య విభాగాల వారీగా ఆర్థోపెడిక్స్‌లో అత్యధికంగా 27 సీట్లు మంజూరయ్యాయి. చర్మ, సుఖ వ్యాధుల విభాగం (డీవీఎల్‌), ఈఎన్‌టీ, పాథాలజీ విభాగాల్లో 16 చొప్పున, రేడియో డయాగ్నోసిస్‌ 14, పీడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ విభాగాల్లో 12 చొప్పున, జనరల్‌ మెడిసిన్‌, అనస్థీషియాలజీ, ఆప్తాల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్‌ విభాగాల్లో 8 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ప్రసూతి, గైనకాలజీ, సైకియాట్రీ, రేడియేషన్‌ ఆంకాలజీ విభాగాల్లో 4 చొప్పున సీట్లు లభించాయి.
Scroll for the next article