News20th Jan 03:45 PMSunil Byrisetty1 min read

పెట్టుబడులకు ఏపీని మించింది లేదు

ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోర

పెట్టుబడులకు ఏపీని మించింది లేదు
ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోన్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో సీఎం ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించినట్టు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంథనం, డిజిటల్ ఇన్ ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై సెషన్‌లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి వివరించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Investments
World Economic Forum
Davos
Andhra Pradesh Advantage
CII Breakfast Session
Foreign Direct Investment
లాజిస్టిక్స్
తయారీ రంగం
2047 భారత్
రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు
Scroll for the next article