National15th Sep 12:15 PMSunil Byrisetty1 min read
రూ. 2 వేల వరకు లావాదేవీలపై చార్జీల్లేవు!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 వేల వరకు జరిపే UPI లావాదేవీలపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు విధించరాదని
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 వేల వరకు జరిపే UPI లావాదేవీలపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు విధించరాదని ఆదేశించింది. రూపే డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు చేసే చెల్లింపులపైనా ఛార్జీలు విధించడాన్ని నిషేధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏ కింద ఈ మార్పులను నోటిఫై చేసినట్లు గెజిట్లో పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. రూ.2 వేల వరకు చేసే యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు గానీ, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. డబ్బులు పంపే, స్వీకరించే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. చిన్న వ్యాపారులు, దుకాణాదారులకు ఈ నిర్ణయం ఉపశమనం కల్గించనుంది.