News18th Jul 01:27 PMSunil Byrisetty1 min read
మహిళల గౌరవం విషయంలో రాజీ లేదు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే తీవ్ర ఆవేదనకు గురయ్యానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. బాధితులు నన
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే తీవ్ర ఆవేదనకు గురయ్యానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. బాధితులు నన్ను కలిసి జరిగిన విషయాన్ని వివరించగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా నగరంపాలెం పోలీసులను సంప్రదించి వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించానని చెప్పారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడనని స్పష్టం చేశారు. మహిళలను అవమానించే, వేధించే, వారి మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి చర్యల నైనా నేను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనాని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.