News17th Aug 04:45 PMSunil Byrisetty1 min read

డీఎస్సీ నియామకాల్లో డీవియేషన్ లేదు

మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ పారదర్శకంగా ఆన్ లైన్‌లోనే ఉంచామన్నారు. వైసీపీ నేతలు హి

డీఎస్సీ నియామకాల్లో డీవియేషన్ లేదు
మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ పారదర్శకంగా ఆన్ లైన్‌లోనే ఉంచామన్నారు. వైసీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు. డీఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. "మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్ధులు తయారవుతారని మేం విశ్వసించాం. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్నాం. ఉపాధ్యాయుల నియామకాలు చేయని 2019-24 మధ్య ఉన్న పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పటి వరకూ 14 డీఎస్సీలు జరిగితే, టీడీపీ, ఎన్డీయే హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేద’’ని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Mega DSC
DSC Recruitment
Teacher Recruitment
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ
విద్యారంగం
టీచర్ ఉద్యోగాలు
నియామకాల పారదర్శకత
వైసీపీ
టీడీపీ
ప్రభుత్వ ఉద్యోగాలు
Scroll for the next article