News13th Jan 11:57 AMSunil Byrisetty1 min read

సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవన్న మంత్రి

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పండుగ

సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవన్న మంత్రి
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పండుగ రద్దీ దృష్ట్యా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు చార్జీలు విధించబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆర్టీసీ చార్జీల్లో కూడా ఎలాంటి పెంపు లేదని తెలిపారు. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా సొంత ఊళ్లకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇది పండుగ కానుకగా అని అన్నారు. ప్రైవేట్ బస్సులు అక్రమంగా చార్జీలు పెంచితే సంబంధిత బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
Andhra Pradesh government
Sankranti travel
no extra bus charges
free bus travel for women
RTC fares unchanged
Transport Minister Mandipalli Ramprasad Reddy
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పండుగ కానుక
ప్రైవేట్ బస్సులపై చర్యలు
Scroll for the next article