News10th Jan 09:02 AMSunil Byrisetty1 min read
అదనపు ఛార్జీలా.. చర్యలే!
సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుందామనుకుంటే కుదరదని ఏపీ రవాణా శాఖ అధికారులు తేల్చి చెప్పారు. సొంతూళ్లకు వచ్చే వారి నుంచి ప్రైవేటు బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు తీ
సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుందామనుకుంటే కుదరదని ఏపీ రవాణా శాఖ అధికారులు తేల్చి చెప్పారు.
సొంతూళ్లకు వచ్చే వారి నుంచి ప్రైవేటు బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ధరలు పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని రవాణాశాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా తెలిపారు. ఆర్టీసీ టికెట్ ఛార్జీల కంటే గరిష్ఠంగా 50% వరకు మాత్రమే టికెట్ ధర పెంచేందుకు వీలుందని, అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభి బస్, రెడ్ బస్ వంటి యాప్ల ద్వారా కూడా ఆయా ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఎంత టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయో పర్యవేక్షిస్తున్నామని, అధిక ధరలు ఉంటే కేసులు పెడతామని చెప్పారు. ప్రైవేటు బస్సులో రవాణాశాఖ హెల్ప్ లైన్ నంబరు 9281607001ను డిస్ప్లే చేయాలని ఆదేశించారు.