Education21st Jul 12:52 PMSunil Byrisetty1 min read

విద్యార్థులకు డిసిప్లిన్.. స్టైల్స్ కుదరవు!

పాఠశాల విద్యార్థులు నచ్చిన స్టైల్ లో బడికి వస్తామంటే కుదరదు. సినిమా నటులు, క్రీడాకారుల ప్రభావంతో నచ్చిన హెయిర్ స్టైల్స్‌ను అనుసరించే విద్యార్థులకు ఇకపై బ్రేక్ పడనుంది. ప్రభుత్వ, ప్

విద్యార్థులకు డిసిప్లిన్.. స్టైల్స్ కుదరవు!
పాఠశాల విద్యార్థులు నచ్చిన స్టైల్ లో బడికి వస్తామంటే కుదరదు. సినిమా నటులు, క్రీడాకారుల ప్రభావంతో నచ్చిన హెయిర్ స్టైల్స్‌ను అనుసరించే విద్యార్థులకు ఇకపై బ్రేక్ పడనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బాలురందరూ ఒకే తరహా హెయిర్ కట్‌తో పాఠశాలకు రావాలని రాష్ట్ర విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్స రం నుంచే ఈ నిబం ధనలు అమల్లోకి రానున్నాయి. చదువుపై దృష్టి.. క్రమశిక్షణే లక్ష్యం పాఠశాలల్లో కొందరు విద్యార్థులు సినీ హీరోలు, క్రికెటర్ల ను అనుకరిస్తూ విభి న్న హెయిర్ స్టైల్స్‌తో వస్తుండటంతో చదువుకంటే రూపు రేఖలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. విద్యార్థుల్లో క్రమ శిక్షణ, సమానత్వ భావన పెంపొందిం చడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Andhra Pradesh
Education Department
School Education
Student Discipline
Haircut Rules
School Guidelines
ప్రైవేట్ పాఠశాలలు
విద్యార్థుల మార్గదర్శకాలు
Scroll for the next article