News5th Aug 11:13 AMSunil Byrisetty1 min read

బీమా లేదా.. నో పెట్రోల్!

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇంధనం నిరాకరించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుత

బీమా లేదా.. నో పెట్రోల్!
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇంధనం నిరాకరించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా వాహన బీమా విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే బీమాను సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం నింపకుండా తిప్పి పంపే విధానాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ గా అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 56 శాతం వాహనాలకు బీమా లేదని, దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్‌ వాహనాల్లో 16.54 కోట్ల వాహనాలకు బీమా లేదని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, బీమా లేక బాధితులకు నష్టపరిహారం అందడం లేదని పేర్కొంది. అందుకే బీమా లేకుండా పట్టుబడిన వాహన యజమానులకు భారీ జరిమానా విధించాలని ఆదేశించింది.
India
Supreme Court
Third Party Insurance
Vehicle Insurance
Petrol Pumps
Road Safety
ట్రాఫిక్ నిబంధనలు
మోటార్ వాహన చట్టం
రోడ్డు ప్రమాదాలు
కేంద్ర ప్రభుత్వం
Scroll for the next article