Spiritual31st Dec 02:50 PMSunil Byrisetty1 min read

ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించం

ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం.. పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకున్నామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇ

ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించం
ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం.. పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకున్నామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు చేశామని వివరించారు. కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం వెలుపల శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని ఆలయ సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే ఆలయంలో మరో నూతన శివలింగాన్ని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు నంద్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులు ఉంచిన విషయమై కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ను విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రసాద వితరణ సమయంలో ప్రసాదంలో ఒక పురుగు రావడాన్ని గుర్తించి తెలిపిన భక్తుడితో దురసుగా ప్రవర్తించిన ఆలయ ప్రసాదం కౌంటర్ లోని ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈవోకు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Endowments Department
Anam Ramnarayana Reddy
Draksharamam Bhimeswara Temple
Simhachalam Appanna Temple
ఆలయ భద్రత
సీసీ కెమెరాలు
విచారణకు ఆదేశాలు
కఠిన చర్యలు
భక్తుల విశ్వాసం
ఆలయ పాలన
Scroll for the next article