News27th Oct 02:35 PMSunil Byrisetty1 min read

తుఫానులో ప్రాణనష్టం జరగకూడదు

ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, రైతులు, పంటలు, పశుసంపద, ప్రజల ఆస్తులకు నష్టం తగ్గించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కింజ

తుఫానులో ప్రాణనష్టం జరగకూడదు
ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, రైతులు, పంటలు, పశుసంపద, ప్రజల ఆస్తులకు నష్టం తగ్గించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 28న యానాం సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వరకు గాలులు వీచే ప్రమాదమున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, వరద ముంపు ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రదేశాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. మూడు జిల్లాల్లో 24 గంటల కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ ఏర్పాట్లు కల్పించాలన్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక రక్షణ కల్పించడంతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
Scroll for the next article