News14th Dec 12:58 PMSunil Byrisetty1 min read

భార్య సంపాదిస్తుంటే భరణం అక్కర్లేదు

విడాకుల కేసుల్లో సమస్యగా మారుతున్న భరణం విషయంలో అలహాబాద్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త కంటే మెరుగైన జీవనం గడపగలిగే సంపాదన కలిగిన భార్యకు CrPC సెక్షన్ 125 కింద భరణం పొందే అర్హ

భార్య సంపాదిస్తుంటే భరణం అక్కర్లేదు
విడాకుల కేసుల్లో సమస్యగా మారుతున్న భరణం విషయంలో అలహాబాద్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త కంటే మెరుగైన జీవనం గడపగలిగే సంపాదన కలిగిన భార్యకు CrPC సెక్షన్ 125 కింద భరణం పొందే అర్హత లేదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నెలకు రూ.36,000 సంపాదిస్తున్న భార్యకు రూ.5,000 భరణం ఇవ్వాలన్న కుటుంబ కోర్టు ఆదేశాలను హైకోర్టు పక్కనపెట్టింది. భరణం కేవలం తనను తాను పోషించుకోలేని మహిళల కోసం ఉద్దేశించినదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో భరణం విషయంలో మరోసారి దేశవ్యాప్త చర్చ మొదలైంది.
Indian Judiciary
Maintenance Debate
Court Verdict
Allahabad High Court
Maintenance Case
Section 125 CrPC
Divorce Law
Family Court
Women Income
Legal News
Scroll for the next article