Film News19th May 01:38 PMSunil Byrisetty1 min read

మంచు కోసం నేనున్నా.. నారా నటుడు ఎమోషనల్!

నటుడు మంచు మ‌నోజ్‌కు మరో నటుడు నారా రోహిత్ అండగా నిలిచారు. 'ఎక్స్' వేదిక‌గా ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ఏది ఏమైనా మ‌నోజ్‌కు అండ‌గా ఉంటాన‌ని అన్నారు. ఆదివారం జ‌రిగిన 'భైర‌వం' ఈవెంట

మంచు కోసం నేనున్నా.. నారా నటుడు ఎమోషనల్!
నటుడు మంచు మ‌నోజ్‌కు మరో నటుడు నారా రోహిత్ అండగా నిలిచారు. 'ఎక్స్' వేదిక‌గా ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ఏది ఏమైనా మ‌నోజ్‌కు అండ‌గా ఉంటాన‌ని అన్నారు. ఆదివారం జ‌రిగిన 'భైర‌వం' ఈవెంట్‌ను విజ‌య‌వంతం చేసిన ఏలూరు ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 'భైరవం' ఈవెంట్‌ను ప్రత్యేకంగా మార్చినందుకు ఏలూరు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బాబాయ్ మంచు మ‌నోజ్ ప్ర‌త్యేకంగా నిలిచాడని, ఆయ‌న‌ ప్రసంగం శక్తివంతమైంది, భావోద్వేగభరితమైంది, హృదయాన్ని కదిలించేదిగా ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా, విష‌యం ఏదైనా.. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను బాబాయ్. ల‌వ్ యూ!" అని రోహిత్ త‌న ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ఇదే కార్య‌క్ర‌మంలో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. ఈవెంట్‌లో ఆయ‌న‌పై ఓ వీడియో (ఏవీ) ప్ర‌ద‌ర్శించ‌గా.. అది చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు
Tollywood
manchu manoj
nara rohith
నారా రోహిత్ ఎక్స్ వేదిక‌గా ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్
Scroll for the next article