News28th Sep 12:39 PMSunil Byrisetty1 min read
28 రోజులు కాదు.. ఇకపై నెల రోజులు
ఏడాదికి 13 సార్లు రీచార్జి చేసుకుంటూ, దోపిడీకి గురవుతున్న మొబైల్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఏడాదికి 13 సార్లు రీచార్జి చేసుకుంటూ, దోపిడీకి గురవుతున్న మొబైల్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టెలికాం వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ట్రాయ్ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఏడాదిలో 12 రీఛార్జ్ లు మాత్రమే అవసరమయ్యేలా ట్రాయ్ నిబంధనలు విధించింది. 28 రోజులకు బదులు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్లు ఉండాలని ట్రాయ్ ఆదేశించింది. డేటా వినియోగించని వారికోసం వాయిస్ ప్లాన్లు ఉండాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. 28 రోజులకే రీచార్జి ప్యాక్ లు ఇవ్వడం ద్వారా నెట్వర్క్ కంపెనీలు మోసం చేస్తున్నాయని, 30 రోజులకు అమలు చేయాలని బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటులో గొంతెత్తిన విషయం తెలిసిందే.