News4th Jan 04:00 PMSunil Byrisetty1 min read
అక్రమ రిజిస్ట్రేషన్లకు ఇకనో చాన్స్!
ఏపీలో రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమ రిజిస్ట్రే
ఏపీలో రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సభ్యులుగా ఉంటారు. రిజిస్ట్రేషన్ చేసే అధికారి కావాలనే తప్పు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తెలిపారు. ఆయన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.