National20th Jul 02:02 PMSunil Byrisetty1 min read

ఆధార్‌లో మార్పులు.. ఆ వివరాలు తొలగింపు!

ఆధార్‌లో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్‌ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త

ఆధార్‌లో మార్పులు.. ఆ వివరాలు తొలగింపు!
ఆధార్‌లో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్‌ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త పేరు ఉండదు. ఆధార్‌లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు. ఈ మేరకు తొలగిస్తూ 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)' నిర్ణయం తీసుకుంది. పుట్టినతేదీకి బదులు ఇకనుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్నే నమోదు చేస్తారు. దీనికి సంబంధించి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ హిమాన్షు ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా.. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. 18 ఏళ్లలోపు ఉండే పిల్లల (మైనర్ల) ఆధార్‌లోనే మాత్రమే కేరాఫ్‌ స్థానంలో వారి తండ్రి పేరు ఉంటుంది.
India news
Aadhaar Update
UIDAI Guidelines
Father's Name Removed
Aadhaar Minor Rules
UIDAI మార్గదర్శకాలు
ఆధార్ కార్డు నిబంధనలు
Scroll for the next article