Education6th Jul 12:23 PMSunil Byrisetty1 min read
గిన్నిస్ రికార్డు దిశగా మెగా పేటీఎం
మెగా పీటీఎంతో గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు చేయించేందుకు ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు తెలిపారు. గిన్నిస్ రికా
మెగా పీటీఎంతో గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు చేయించేందుకు ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు తెలిపారు. గిన్నిస్ రికార్డుల నమోదు బృందం ఇచ్చిన సూచనల మేరకు విద్యాశాఖ, టీచర్, తల్లిదండ్రి కాకుండా.. అదే పాఠశాల పరిధిలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిని అంటే సర్పంచ్, ఎంపీటీసీ, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి, దాత, పూర్వ విద్యార్థి ఎవరినైనా రిజిస్ట్రేషన్‌కు సాక్ష్యంగా, ఆ వ్యక్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం మాత్రమే, ఆ టీం ఇచ్చిన సూచనల మేరకు లీప్ యాప్‌లో మెగా పీటీఎం 2.0 రిజిస్ట్రేషన్‌లో వ్యక్తి విట్నెస్ నమోదు తప్పనిసరి అని, ఆ విట్నెస్ ఇచ్చే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాకూడదని వివరించారు. అంతకుమించి ఈ విట్నెస్ నమోదు వెనుక ఎటువంటి ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలా గత ఏడాది డిసెంబర్ 7న నిర్వహించిన మెగా పీటీఎంలో అంతా కలిసి కోటికి పైగా పాల్గొన్నారని తెలిపారు. జూలై 10న నిర్వహించబోయే మెగా పీటీఎం 2.0లో 2.28 కోట్ల మందికి పైగా పాల్గొని గిన్నిస్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేయనున్నామని ప్రకటించారు.