News13th Oct 12:18 PMSunil Byrisetty1 min read

గ్రీవెన్స్ పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు

ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం పీజీఆర్ఎస

గ్రీవెన్స్ పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు
ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం పీజీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజల సమస్యలను వీలైనంత మేరకు పరిష్కరించగలుగుతున్నామని, మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించాలని సీఎస్ సాయి ప్రసాద్‌ను సీఎం ఆదేశించారు. ఆ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పరిష్కరించే విషయంలో ఉద్యోగులకు, అధికారులకు జవాబుదారీతనం ఉండేలా చూడాలన్నారు. వివిధ శాఖలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... జారీ చేస్తున్న జీవోలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవోపై ఈ తరహా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమర్ధంగా సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
Scroll for the next article