News1st Dec 04:56 PMSunil Byrisetty1 min read

తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరన్న మంత్రి

పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపటితో గడువు ముగుస్తుండటంతో నిందితులు ఎవరనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. తప్పు

తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరన్న మంత్రి
పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపటితో గడువు ముగుస్తుండటంతో నిందితులు ఎవరనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీపడటం చరిత్రలో జరగని, వినని అంశమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విచారణపై అనుచితంగా మాట్లాడే అర్హత భూమన కరుణాకర్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి, భక్తుల మనోభావాలను కరుణాకర్ రెడ్డి దెబ్బతీశారని మండిపడ్డారు. సూత్రధారి, పాత్రధారి ఆయనే కాబట్టి అనుచితంగా మాట్లాడారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి, పరకామణిలో తప్పులు చేశామని ఒప్పుకుంటూనే తాము చేయలేదని, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Parakamani Theft Case
AP Minister Anagani Satyaprasad
CID Investigation
Bhuman Karunakar Reddy
Tirumala Temple
రాజకీయాలు
దేవస్థాన వ్యవహారాలు
నిందితులు
దర్యాప్తు
Scroll for the next article