News22nd Aug 09:03 AMSunil Byrisetty1 min read

అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దుకాదు

పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించార

అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దుకాదు
పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్న వారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ ప్రక్రియలో అనర్హులను గుర్తించినట్టు, అన్నివిధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి.. ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది పెన్షన్ పొందుతున్నట్టు పరిశీలనలో తేలిందని తెలిపారు. అనర్హులైన పెన్లన్లు ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి నిర్ధారించినట్టు వెల్లడించారు. అయితే నకిలీ పెన్షన్లను మాత్రమే తొలిగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛనుదారుకు పెన్షన్ రద్దు కాకూడదని సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన పెన్షన్లు యధావిధిగా కొనసాగుతాయని, దివ్యాంగులు ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు.
Andhra Pradesh Welfare
CM Chandrababu Naidu
NTR Bharosa Pensions
Disabled Pensions
Pension Scheme Review
Fake Pension Removal
Eligible Beneficiaries
అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దుకాదు
Scroll for the next article