News26th Aug 11:32 AMSunil Byrisetty1 min read

గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు

గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని, సాంప్రదాయబద్ధంగా తీన్మార్ కోలాటాలతో పండుగ చేసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ అన్నారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాల

గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు
గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని, సాంప్రదాయబద్ధంగా తీన్మార్ కోలాటాలతో పండుగ చేసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ అన్నారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం శివాలయంలో వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రవి కుమార్ మాట్లాడుతూ.. మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాయక నిమజ్జనోత్సవంలో ఎలాంటి గొడవలకు, అల్లర్లకు పాల్పడరాదన్నారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ శాంతియుతంగా సాంప్రదాయ బద్ధంగా పండుగ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పగలు, రాత్రి విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ ప్రతినిధులు పహారా ఉండాలన్నారు. విద్యుత్తు, అగ్నిమాపక శాఖల అనుమతులు తీసుకోవడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Andhra Pradesh Police
Ganesh Immersion
DJ Ban Ganesh Festival
Mangalagiri
Tadepalli
Vinayaka Chavithi Celebrations
Ganesh Festival Security
AP SP Ravi Kumar
గణేష్ నిమజ్జనం
డీజే నిషేధం
Scroll for the next article