Technology30th Nov 12:22 PMSunil Byrisetty1 min read

ఫోన్ నంబర్ లేకుంటే.. వాట్సప్, టెలిగ్రాం బంద్

ఒక ఫోన్ నంబర్‌తో వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్ ఛాట్ లాంటి సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్స్ రిజిస్టరై, తర్వాత మార్చేద్దామంటే ఇకపై కుదరదు. ఇప్పటివరకు ఒక ఫోన్‌లో సిమ్ ఉన్నా.. ఆ ఫోన్‌కు వ

ఫోన్ నంబర్ లేకుంటే.. వాట్సప్, టెలిగ్రాం బంద్
ఒక ఫోన్ నంబర్‌తో వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్ ఛాట్ లాంటి సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్స్ రిజిస్టరై, తర్వాత మార్చేద్దామంటే ఇకపై కుదరదు. ఇప్పటివరకు ఒక ఫోన్‌లో సిమ్ ఉన్నా.. ఆ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వేరే ఫోన్‌లో కూడా యాప్స్ వాడేందుకు వీలవుతుంది. కానీ ఇక నుంచి అలాంటి అవకాశం ఉండదు. సోషల్ మీడియా యాప్స్ వాడాలంటే తప్పనిసరిగా ఫోన్‌లో సిమ్ ఉండేలా భారత టెలికమ్యూనికేషన్ విభాగం నిబంధనలు తెచ్చింది. సిమ్ లేకుండా వినియోగదారులకు సేవలు అందించే విధానానికి స్వస్తి పలకాలని తెలిపింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్‌ వంటి సంస్థలకు టెలికమ్యూనికేషన్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్ వాలిడేషన్ కోసం మొబైల్ నంబర్‌లను ఉపయోగించే కొన్ని యాప్‌లు సిమ్ లేనప్పుడు కూడా యాక్సెస్‌ను అనుమతిస్తున్నాయి.సైబర్ మోసాలు చేసేవారికి ఇది ఉయోగకరంగా ఉంటుందని కేంద్రం గుర్తించింది. దీనికి చెక్ పెట్టేందుకు సిమ్ బైండింగ్‌ ఉండేలా చూసుకోవాలని సోషల్ మీడియా యాప్స్‌కు ఆదేశాలిచ్చింది. దీని వల్ల సోషల్ మీడియాలో జరిగే మోసాలు,సైబర్ నేరాలు తగ్గిపోతాయని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకులు, యూపీఐ యాప్‌లు సిమ్ బైండింగ్ ప్రక్రియను చేపడుతున్నాయి. అదే తరహాలో ఇప్పుడు సోషల్ మీడియా యాప్‌లు కూడా సిమ్ బైండింగ్ చేపట్టాల్సి ఉంటుంది.
India Tech News
WhatsApp
Telegram
SIM Binding
Social Media Rules
Cybersecurity
Government Regulations
OTP Verification
Messaging Apps
Digital Safety
Scroll for the next article