Education26th Aug 01:27 PMSunil Byrisetty1 min read
మా బడిలో ప్లాస్టిక్ వద్దే వద్దు!
ప్లాస్టిక్ పెను భూతానికి చెక్ పెడుతూ ఆదర్శంగా నిలుస్తోంది ఓ ఉన్నత పాఠశాల. ఆ బడిలోని ఏ విద్యార్థి, ఉపాధ్యాయులు ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించకపోవడం విశేషం. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి
ప్లాస్టిక్ పెను భూతానికి చెక్ పెడుతూ ఆదర్శంగా నిలుస్తోంది ఓ ఉన్నత పాఠశాల. ఆ బడిలోని ఏ విద్యార్థి, ఉపాధ్యాయులు ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించకపోవడం విశేషం. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ గతంలో తమ ఇళ్ల నుంచి మధ్యాహ్న భోజనానికి అవసరమైన నీటిని ప్లాస్టిక్ బాటిళ్లు తెచ్చుకుని తాగేవారు. అయితే ఇటీవల భౌతిక, రసాయన శాస్త్రం ఉపాధ్యాయిని శ్రీదేవి ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. దీంతో విద్యార్థులందరూ ప్లాస్టిక్ ను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో స్టీలు సీసాలు కొనే స్తోమత విద్యార్థులకు లేదని గ్రహించిన ఆ ఉపాధ్యాయిని తన కుమార్తె, అల్లుడు మౌనిక యాదవ్, ప్రశాంత్ ల సాయంతో విద్యార్థులకు స్టీలు తాగునీటి సీసాలను వితరణగా అందించారు. దీంతో పాఠశాలలో ప్లాస్టిక్ సీసాలు కనుమరుగయ్యాయి.