News20th Jul 03:59 PMSunil Byrisetty1 min read

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రమూ కాదన్నారు. పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు. పాస్ పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్ పోర్టు ప్రాసెసింగ్ అనేది చాలా సులువైందన్నారు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు ఉంటుందని తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విషయంలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను వివరించాలన్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతామని సీఎం పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Sub Registrar Offices
Registration Service Centres
ప్రైవేటీకరణ
డాక్యుమెంట్ రైటర్లు
ప్రభుత్వ సేవలు
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article