News1st Oct 04:34 PMSunil Byrisetty1 min read
అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదు
గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలతో తన పర్యటనను ప్రారంభించారు. మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించి, స్థానిక పోలీసు సిబ్బందితో
గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలతో తన పర్యటనను ప్రారంభించారు. మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించి, స్థానిక పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మంగళగిరి పరిధిలో గంజాయి సమస్య, ట్రాఫిక్ సమస్యలను ప్రధానంగా గుర్తించామని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.