News21st Jan 03:48 PMSunil Byrisetty1 min read
వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ స
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ఓపీ సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య పరీక్షలు, కన్సల్టేషన్ రూమ్‌ల పనితీరు, టెలీ క్లినిక్ సేవల అమలు తీరును సమీక్షించారు. లేబొరేటరీ విభాగంలో జరుగుతున్న పరీక్షలు, నివేదికల జారీ విధానం, అవసరమైన పరికరాల అందుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన సమాచార పట్టికలు, అవగాహన పోస్టర్లను, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ) ప్రయోజనాల సమాచారాన్ని సక్రమంగా ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై అభిప్రాయాలు, లేదా సమస్య ఉంటే ఆయా ఆసుపత్రుల్లో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి (8885592974) ప్రజలు నేరుగా తెలియజేయవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.