News8th Sep 04:10 PMSunil Byrisetty1 min read
జిల్లాలో యూరియా కొరత లేదు..
జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గతేడాది ఖరీఫ్‌తో పోల్చితే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి తగ
జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గతేడాది ఖరీఫ్‌తో పోల్చితే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి తగ్గట్లు యూరియాకు కూడా డిమాండ్ పెరిగిందని అన్నారు. ఇటీవల వర్షాలు కూడా బాగా పడటం వల్ల ఒక్కసారిగా డిమాండ్ అధికమైందని వివరించారు. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తోందని, ఆ సమాచారాన్ని రైతులకు అందిస్తూ పంపిణీ పరంగా సమస్యలు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ఒకేసారి వచ్చిన సందర్భంలో రైతులు లైన్లలో ఉండి క్రమశిక్షణతో యూరియా తీసుకోవడం జరుగుతోందని.. అయితే ఆ ఫొటోల ఆధారంగా యూరియా లేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఎరువులకు సంబంధించి వాస్తవ సమాచారాన్ని రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్‌కే), పీఏసీఎస్‌లను సంప్రదించాలని, లేదంటే కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) నంబరులో సంప్రదించాలన్నారు.