Mobiles25th Jul 03:17 PMSunil Byrisetty1 min read

నోకియా షీల్డ్ ఫోన్.. రఫ్ అండ్ టఫ్ గురూ!

మన్నికైన బ్రాండ్ గా పేరున్న నోకియా మరో రఫ్ అండ్ టఫ్ కీప్యాడ్ ఫోన్ ను తెచ్చింది. హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్ నోకియా బ్రాండింగ్‌లో సరికొత్త రగ్గడ్ డిజైన్ ఫీచర్ ఫోన్‌ను నోకియా 123 షీల్డ్ పేరు

నోకియా షీల్డ్ ఫోన్.. రఫ్ అండ్ టఫ్ గురూ!
మన్నికైన బ్రాండ్ గా పేరున్న నోకియా మరో రఫ్ అండ్ టఫ్ కీప్యాడ్ ఫోన్ ను తెచ్చింది. హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్ నోకియా బ్రాండింగ్‌లో సరికొత్త రగ్గడ్ డిజైన్ ఫీచర్ ఫోన్‌ను నోకియా 123 షీల్డ్ పేరుతో అధికారికంగా గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. రఫ్ అండ్ టఫ్ వాడకానికి, అవుట్‌డోర్ వర్కర్లకు అనువుగా ఉండేలా ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరలోనే అన్ని రకాల ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపుదిద్దినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ పేరులోనే ఉన్నట్లుగా ఇది ఒక రక్షణ కవచం (షీల్డ్) లాంటి గట్టి బాడీతో రూపొందించబడింది. వర్షం, నీటి జల్లులు, ఇసుక, తీవ్రమైన ధూళిని తట్టుకోవడానికి ఈ ఫోన్‌కు IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ లభించింది. చేతిలో నుంచి జారకుండా ఉండేందుకు ఫోన్ ఇరువైపులా స్లిప్-రెసిస్టెంట్ టెక్స్చర్డ్ ఫినిషింగ్ అందించారు.
Tech news
Nokia123Shield
Nokia
Feature phone
Keypad phone
Rugged Phone
HMD Global IP65
Water Resistant
Scroll for the next article