Mobiles5th Jan 01:20 PMSunil Byrisetty1 min read

నోకియా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ త్వరలో..

ఫిన్ ల్యాండ్‌కి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన హెచ్ఎండీ గ్లోబల్, తమ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన HMD Pulse 2 ని త్వరలో గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉన్

నోకియా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ త్వరలో..
ఫిన్ ల్యాండ్‌కి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన హెచ్ఎండీ గ్లోబల్, తమ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన HMD Pulse 2 ని త్వరలో గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది గత ఏడాది విడుదలైన HMD Pulse స్మార్ట్ ఫోన్ కి అడ్వాన్స్డ్ వెర్షన్ గా రానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల కాకముందే, దీనికి సంబంధించిన ఫీచర్స్ ఆన్ లైన్ ప్లాట్ ఫారంలోకి లీక్ అవ్వడం జరిగింది. వీటి ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ యూనీ ఎస్ఓసీ T7250 ప్రాసెసర్ తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగా పిక్సల్ మెయిన్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, ఇది మన దేశంలో సుమారు రూ. 12,000గా ఉండే అవకాశం ఉన్నట్లు లీకుల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కేవలం యూరోపియన్ దేశాలలో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
HMD Pulse 2
Nokia Budget Smartphone
HMD Global
Budget Mobile Phone
Smartphone Leaks
5G Mobile News
Android Smartphone
Mobile Technology
European Market
Affordable Smartphone
Scroll for the next article