Mobiles6th Jul 10:39 AMSunil Byrisetty1 min read
గ్లాస్ డిస్ ప్లేతో నోకియా హెచ్ఎండి ఫోన్
నోకియా సంస్థ HMDగా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండి పేరుతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేయనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీమియం ఫీచర్స్‌తో స్మా
నోకియా సంస్థ HMDగా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండి పేరుతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేయనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీమియం ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కెమెరా లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని అతిపెద్ద బ్యాటరీతో స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా గ్లాస్ స్మార్ట్ ఫోన్స్ అని కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి 200-మెగాపిక్సెల్ కెమెరా, హై ఎండ్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్‌కు సంబంధించిన విశిష్టత ఏంటంటే బాడీ మొత్తం గ్లాసులు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ప్రత్యేకమైన డిస్ప్లే సెటప్ ను కూడా కలిగి ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకమైన ప్రొటెక్షన్ కోసం ఇందులో హెచ్ఎండి కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ కూడా అందిస్తోంది. ఈ మొబైల్ కు సంబంధించిన డిస్ప్లే 6.9-అంగుళాల సూపర్ AMOLED ప్యానెల్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే 4K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఎంతో శక్తిమంతమైన 8200mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. ఇక కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.