Politics17th Apr 09:21 AMSunil Byrisetty1 min read
నామినేటెడ్ భర్తీ.. 3 పార్టీలకూ చోటు!
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడతలో 47, రెండో విడతలో 38 కమిటీలకు ఛైర్మన్లను నియమించగా.. తాజాగా 30 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ఏపీ సర్
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది.
ఇప్పటికే తొలి విడతలో 47, రెండో విడతలో 38 కమిటీలకు ఛైర్మన్లను నియమించగా.. తాజాగా 30 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ఏపీ సర్కార్ ప్రకటించింది.
30 స్థానాల్లో టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీకి 1 కేటాయించింది.
త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మన్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
మిగిలిన వాటికి త్వరలో నియమించనున్నారు.
రాష్ట్రంలో 218 మార్కెట్ కమిటీలు ఉండగా.. పాలకవర్గ గౌరవ ఛైర్మన్‌గా స్థానిక శాసనసభ్యుడు వ్యవహరిస్తారు.
గౌరవ ఛైర్మన్, ఛైర్మన్‌తో కలిపి కమిటీలో 20 మంది సభ్యులుగా ఉంటారు.
ఛైర్మన్, సభ్యుల పదవీకాలం ఏడాది ఉంటుంది