Politics25th May 10:08 AMSunil Byrisetty1 min read

త్వరలో మిగతా నామినేటెడ్ పదవుల భర్తీ

గడిచిన ఎన్నికల్లో కూటమి విజయంలో కార్యకర్తల కృషి మరువలేనిదని మంత్రి సవిత కొనియాడారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, ఇ

త్వరలో మిగతా నామినేటెడ్ పదవుల భర్తీ
గడిచిన ఎన్నికల్లో కూటమి విజయంలో కార్యకర్తల కృషి మరువలేనిదని మంత్రి సవిత కొనియాడారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, ఇప్పటికే ఈ దిశగా మంత్రి నారా లోకేశ్ చర్యలు ప్రారంభించారని వెల్లడించారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులపైనా బనాయించిన అక్రమ కేసుల మాఫీపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడు విజయవంతానికి కృషి చేయాలన్నారు. జిల్లా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
AndhraPradesh
Kadapa
Mahanadu
TeluguDesamParty
nominated posts
మంత్రి సవిత
కడపలో నిర్వహించే మహానాడు విజయవంతానికి కృషి చేయాలన్నారు
నామినేటెడ్ పదవులు భర్తీ
Scroll for the next article