News31st Aug 03:28 PMSunil Byrisetty1 min read
నెక్ట్స్ ఎలక్షన్ కోసం కాదు.. నెక్ట్స్ జనరేషన్ కోసం!
రాజకీయమంటే ఎన్నికలు కాదని, ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావడమని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలిగొండ ఫేజ్ 1 ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ తాను ఓట్లు ఆశించి కాదని
రాజకీయమంటే ఎన్నికలు కాదని, ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావడమని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలిగొండ ఫేజ్ 1 ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ తాను ఓట్లు ఆశించి కాదని, మార్పు ఆశించి పని చేస్తానని, ఇది తన సిద్ధాంతం, కూటమి విధానమని స్పష్టం చేశారు. గెలుపోటములు, లాభనష్టాలు చూడనని, జీవితాలు మార్చేందుకు ఆలోచిస్తానని అన్నారు. నెక్ట్స్ ఎలక్షన్ కోసం కాదని, నెక్ట్స్ జనరేషన్ కోసం పని చేస్తానని పేర్కొన్నారు. అందరూ ఎన్నికల కోసం పని చేస్తే, తాను మాత్రం ప్రజల భవిష్యత్తు, భావితరాల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. ఊపిరి ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం కష్టపడతానన్నారు. హెల్తీ, వెల్దీ, హ్యాపీ సమాజమే లక్ష్యమన్నారు. అందరం కలిసి తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ 1గా చేద్దామని, స్వర్ణాంధ్రను నిర్మిద్దామన్నారు. ‘మార్కాపురం అన్ స్టాపబుల్’ అంటూ నినదించారు. ప్రజలందరితో నినాదాలు చేయించారు. నేటి నుంచి పచ్చ జెండా రెపరెపలాడుతుందని, రైతుల దశ దిశ మారుతుందని పేర్కొన్నారు.