Politics26th Sep 06:04 PMSunil Byrisetty1 min read
గెలుపు కోసం కాదు.. అలా జరగాలని!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని వైసీపీ కోరుకుంటోంది. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలమైన ఫలితాలు వస్తాయనే ఆశ లేకపోయి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని వైసీపీ కోరుకుంటోంది. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలమైన ఫలితాలు వస్తాయనే ఆశ లేకపోయినా రెండు విషయాల కోసం ఎన్నికలు జరగాలనుకుంటోంది. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూల ఫలితాలు వస్తుంటాయి. ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రీతిలో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకున్నామని అనధికారికంగా వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. తమకు మించి అరాచకాలకు కూటమి నేతలు తెరలేపుతారని, తద్వారా ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిని తెచ్చుకుంటారనేది భావిస్తోంది. సీట్ల పంపిణీలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తుతాయని వైసీపీ నమ్ముతోంది. ఇప్పటికే జనసేన నేతలు 30 శాతం పైగా సీట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. సీట్ల పంపిణీలో ఏకాభిప్రాయం కుదరకపోతే, ఫ్రెండ్లీ పోటీ తప్పదని ఇప్పటికే పవన్‌కల్యాణ్ తన పార్టీ నేతలతో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తడం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా తమకు లాభిస్తుందని వైసీపీ ఆశ పెట్టుకుంది.