News4th Oct 03:56 PMSunil Byrisetty1 min read
ఎంపీకే కాదు.. ఏపీకి కూడా మామయ్యనే!
ఆంధ్రప్రదేశ్ వంటి పుణ్యభూమికి కోటి ప్రణామాలు అని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. మధ్యప్రదేశ్‌కే కాదు... ఆంధ్రప్రదేశ్‌కు కూడా నేను మామయ్య వంటివాణ్నేనని చెప్పారు. తెనాలిలో
ఆంధ్రప్రదేశ్ వంటి పుణ్యభూమికి కోటి ప్రణామాలు అని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. మధ్యప్రదేశ్‌కే కాదు... ఆంధ్రప్రదేశ్‌కు కూడా నేను మామయ్య వంటివాణ్నేనని చెప్పారు. తెనాలిలో నిర్వహించిన- తెనాలి పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వర్ణాంధ్రపై చంద్రబాబు విజన్ గొప్పది.. పని అనుకున్నారంటే పూర్తయ్యేవరకు ఆగరని ప్రశంసించారు. టెక్నాలజీపై ముందే ఆలోచించి కొత్త అధ్యాయాన్ని ఏపీలో అమలు చేస్తున్నారన్నారు. దేశంలోనే అభివృద్ధిలో ఏపీ.. ప్రథమ స్థానంలో నిలవబోతోందని పేర్కొన్నారు. చంద్రబాబు పేద ప్రజల సొంత ఇంటి కల సాకారానికి తీవ్రంగా కృషిచేస్తున్నారని వివరించారు.