Politics5th Oct 03:47 PMSunil Byrisetty1 min read
పార్టీ కాదు.. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం
తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధి విషయంలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్ పవన్ కళ్యాణ్ అన
తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధి విషయంలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్ పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే ‘అమరజీవి జలధార’ లక్ష్యమని తెలిపారు. జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో రూ.30,156 కోట్ల విలువైన తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు. “శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన నేల. మహాత్మా గాంధీ నడయాడిన నేల. తెలుగు సాహిత్య్యాన్ని తన అక్షరాలతో సుసంపన్నం చేసిన సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులకు జన్మనిచ్చిన నేల ప్రొద్దుటూరు. బంగారం, వస్త్ర వ్యాపారంలో మినీ ముంబై గా, దసరా ఉత్సవాల్లో రెండో మైసూరు గా ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.30,156 కోట్లతో 50,315 పనులను శ్రీకారం చుడుతున్నాం. 24,601 ఆవాసాల్లో ఇప్పటికే ఉన్న 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచి స్థిరీకరించడంతో పాటు, మరో 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లను అందిస్తున్నాం. మొత్తంగా 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామ’ని పేర్కొన్నారు.