Mobiles2nd Jul 04:23 PMSunil Byrisetty1 min read

డిఫరెంట్ లుక్‌తో నథింగ్‌ ఫోన్‌ 3

ప్రముఖ మొబైల్‌ కంపెనీ నథింగ్‌ ఫోన్‌ 3 డిఫరెంట్ లుక్‌తో మార్కెట్లోకి విడుదల అయింది. 6.67 ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో నథింగ్‌ ఫోన్‌ 3ని తీసుకొచ్చారు. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌ 4 ప్

డిఫరెంట్ లుక్‌తో నథింగ్‌ ఫోన్‌ 3
ప్రముఖ మొబైల్‌ కంపెనీ నథింగ్‌ ఫోన్‌ 3 డిఫరెంట్ లుక్‌తో మార్కెట్లోకి విడుదల అయింది. 6.67 ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో నథింగ్‌ ఫోన్‌ 3ని తీసుకొచ్చారు. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌ 4 ప్రాసెసర్‌ను వాడారు. కొత్తగా ఫోన్‌ వెనుక గ్లాఫ్‌ మ్యాట్రిక్‌ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేశారు. రెండు వేరియంట్లలో నథింగ్‌ ఫోన్‌ 3ని తీసుకొచ్చారు. 12 జీబీ+256 జీబీ ధర రూ.79,999గా, 16 జీబీ+512 జీబీ ధరను 89,999గా నిర్ణయించారు. నథింగ్‌ ఫోన్‌ 3లో వెనక వైపు మూడు కెమెరాలు ఇచ్చారు. 50ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50 ఎంపీ 3x పెరిస్కోప్‌ లెన్స్‌తో కూడిన కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగ్‌ లెన్స్‌తో కూడిన కెమెరాలు ఇచ్చారు. 60x డిజిటల్‌ జూమ్‌ సౌకర్యం ఉంది. ముందు వైపు సెల్ఫీలు, వీడియోల కోసం 50ఎంపీ కెమెరా ఇచ్చారు. 5500 ఎంఏహెచ్‌తో కూడిన బ్యాటరీ ఉంది. 120హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. నలుపు, తెలుపు రంగుల్లో ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 3.5తో ఇది పనిచేస్తుంది. 1.5 రిజల్యూషన్‌ సౌకర్యం ఉంది. ముందువైపు గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్‌, వెనక వైపు గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ఇచ్చారు. 65 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 15w వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం సైతం ఉంది. 7.5w రివర్స్‌ ఛార్జింగ్‌, 5w రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. మొత్తం 5 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, ఏడేళ్ల పాటు ప్రతి రెండు నెలలకొకసారి చొప్పున సెక్యూరిటీ ప్యాచెస్‌లను ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
Mobiles
Android
Nothing Phone 3
nothing.tech
Glyph matrix
Essential Key
Snapdragon 8s Gen 4
Scroll for the next article