Mobiles23rd Nov 02:52 PMSunil Byrisetty1 min read

నథింగ్ నుంచి చౌకైన స్మార్ట్ ఫోన్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్‌’ మరో మొబైల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో భాగంగా ‘నథింగ్‌ ఫోన్‌ 3ఏ లైట్‌’ను రిలీజ్ చేయనుంది. నవంబర్ 27

నథింగ్ నుంచి చౌకైన స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్‌’ మరో మొబైల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో భాగంగా ‘నథింగ్‌ ఫోన్‌ 3ఏ లైట్‌’ను రిలీజ్ చేయనుంది. నవంబర్ 27న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. రిలీజ్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్లో నథింగ్ ఇప్పటికే ఫోన్ 3, ఫోన్ 3a, ఫోన్ 3a ప్రోను విడుదల చేసింది. గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే ఇండియన్ డిజైన్‌ రానుంది. నథింగ్ ఫోన్ 3a లైట్ మొబైల్‌లో 6.77-అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో రానుంది. ఇది 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే 387 పిక్సెల్ సాంద్రతను కలిగి ఉంది. దాంతో మంచి వీడియో, గేమింగ్ అనుభవం ఇస్తుంది. ఈ ఫోన్ 4nm MediaTek Dimensity 7300 Pro ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB RAM అండ్ 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో రానుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఫోన్‌లో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ అండ్ 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా ఉండడంతో ఈ ఫోన్ వీడియో, ఫోటోగ్రఫీకి అద్భుతమైన ఎంపిక అని చెప్పొచ్చు. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
Nothing Phone 3A Lite
Nothing Mobile
Smartphone Launch
India
Flipkart
AMOLED Display
MediaTek Dimensity 7300 Pro
8GB RAM
5
000mAh Battery
Mobile Photography
Scroll for the next article