Mobiles28th Jan 05:27 PMSunil Byrisetty1 min read
నథింగ్ ఫోన్ 4a ప్రో వచ్చేస్తోందోచ్.. కీలక ఫీచర్లివే
నథింగ్ ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. టెక్ బ్రాండ్ నథింగ్ నుంచి సరికొత్త సిరీస్ రాబోతుంది. నెక్ట్స్ జనరేషన్ నథింగ్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే గత మార్చిలో నథ
నథింగ్ ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. టెక్ బ్రాండ్ నథింగ్ నుంచి సరికొత్త సిరీస్ రాబోతుంది. నెక్ట్స్ జనరేషన్ నథింగ్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే గత మార్చిలో నథింగ్ ఫోన్ (3a), నథింగ్ ఫోన్ (3a) ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ కాగా మరో కొత్త సిరీస్ లాంచ్ చేయనుంది. ఇందులో నథింగ్ ఫోన్ 4a, నథింగ్ ఫోన్ 4a ప్రో ఉన్నాయి. రాబోయే నథింగ్ ఫోన్లకు సంబంధించి లాంచ్ టైమ్ లైన్ ఎప్పుడు అనేది కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గత మోడల్ నథింగ్ ఫోన్ 3A ప్రో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందింది. ఈ ఫోన్ 4A ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది.