Notifications10th Jul 05:38 PMSunil Byrisetty1 min read

డిఎంఇ ఆసుప‌త్రుల్లో 77 మంది డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీ

డిఎంఇ ఆసుప‌త్రుల్లో 77 మంది డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీ కోసం ఈనెల 17న వాకిన్ రిక్రూట్మెంట్‌ నిర్వహించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌

డిఎంఇ ఆసుప‌త్రుల్లో 77 మంది డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీ
డిఎంఇ ఆసుప‌త్రుల్లో 77 మంది డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీ కోసం ఈనెల 17న వాకిన్ రిక్రూట్మెంట్‌ నిర్వహించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో 40 మంది ప్రొఫెస‌ర్లు, 37 మంది అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల భర్తీ చేపట్టనుంది.ఓల్డ్ జిజిహెచ్ క్యాంప‌స్, హ‌నుమాన్ పేట‌, విజ‌య‌వాడ‌లోని డిఎంఇ కార్యాల‌యంలో వాకిన్ రిక్రూట్మెంట్‌ నిర్వహించనున్నారు. ఉద‌యం 10.30 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాకిన్ రిక్రూట్మెంట్‌ జరగనుంది. వివ‌రాల‌కు http://apmsrb.ap.gov.in/msrb/ లేదా https://dme.ap.nic.in వెబ్‌సైట్ల‌ను చూడొచ్చు అలాగే నేషనల్ హెల్త్ మిషన్ లో 15 ఎపిడిమాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి కాంట్రాక్టు విధానంలో భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 10 నుంచి 16 వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
Andhra Pradesh
Vijayawada
Medical Services Recruitment Board
Notifications
77 doctor posts in DME hospitals
walk-in recruitment
Old GGH Campus
Scroll for the next article