Politics13th Nov 01:52 PMSunil Byrisetty1 min read
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నవంబర్ 17 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటించారు. నవంబర్
ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నవంబర్ 17 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటించారు. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన, 19న తిరస్కరణపై అప్పీలు, నవంబర్ 20న అప్పీళ్ల పరిష్కారానికి అవకాశం కల్పించారు. నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం అదే రోజు తుది అభ్యర్థుల జాబితా ప్రకటన చేయనున్నారు. నవంబర్ 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాల ప్రకటన చేయనున్నారు.