News24th Oct 02:45 PMSunil Byrisetty1 min read

బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు

బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి ఇప్పటిదాకా ఒక్కరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. కానీ, ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు న

బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు
బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి ఇప్పటిదాకా ఒక్కరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. కానీ, ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మన దేశంలోని బ్యాంకుల్లో దాదాపు రూ.67,000 కోట్లకు పైగా డబ్బు ఎవరూ వెనక్కి తీసుకోకుండా అలా ఉండిపోయింది. ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఉన్న ఒక్క నామినీ అందుబాటులో లేకపోవడం, లేదా క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగు తోంది. దీంతో కుటుంబ సభ్యులు, డబ్బులు వెనక్కి తీసుకోవడం కోసం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ ఖాతాలతో పాటు, లాకర్లకూ వర్తిస్తాయి.
India finance
Nominee Rules
Finance Update
Bank Accounts
Locker Rules
Government Regulations
Financial Security
భారత ఆర్థిక వ్యవస్థ
బ్యాంకింగ్ సంస్కరణలు
సేవింగ్స్ అకౌంట్
Scroll for the next article