News6th Aug 10:57 AMSunil Byrisetty1 min read

మంత్రిపై ఎన్నారై ఆరోపణలు.. రాష్ట్రంలో చర్చ

ఏపీకి చెందిన ఓ మంత్రి అనుచితంగాా ప్రవర్తించారంటూ ఓ ఎన్నారై సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎన్జీవో నిర్వాహకురాలు డా. శైలా తాళ్లూర

మంత్రిపై ఎన్నారై ఆరోపణలు.. రాష్ట్రంలో చర్చ
ఏపీకి చెందిన ఓ మంత్రి అనుచితంగాా ప్రవర్తించారంటూ ఓ ఎన్నారై సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎన్జీవో నిర్వాహకురాలు డా. శైలా తాళ్లూరి పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ పోస్టులో సీఎం, మంత్రులనూ ట్యాగ్ చేశారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్‌ చర్య తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. “లోకేష్ గారూ.. మీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి అనుచిత ప్రవర్తనపై నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించండి. పారదర్శకంగా విచారణ జరిపి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలి” అని ఆమె పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఎన్నారై వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆమె ఏ మంత్రి గురించి మాట్లాడారనే విషయాన్ని వెల్లడించలేదు. దీంతో ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది.
Andhra Pradesh
AP Minister
NRI
Shaila Talluri
Dr. Shaila Talluri
Nara Lokesh
Social Media
Allegations
విచారణ
పారదర్శకత
ఆంధ్ర వార్తలు
వైరల్ పోస్ట్
ఎన్జీవో
Scroll for the next article