Entertainment9th Dec 12:39 PMSunil Byrisetty1 min read

ఢిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటి

ఢిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా చర్యలు సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది. గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇలాంటి పరిస్థితే ఎదురవగా అప్పట్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయవాది ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఇలాంటి అంశాలనే లేవనెత్తుతూ పలువురు సినీప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో నాగార్జున, ఐశ్వర్యరాయ్, అమితాబ్, పండిట్ రవి శంకర్ తదితరులు ఉన్నారు.
Tollywood News
Legal News
Jr NTR
Delhi High Court
Petition
Personal Rights
Social Media
IT Act 2021
Bollywood
Ajay Devgn
Nagarjuna
Aishwarya Rai
Amitabh Bachchan
Pandit Ravi Shankar
Court Hearing
Scroll for the next article