News24th Sep 12:05 PMSunil Byrisetty1 min read
ఏపీలో ఎన్టీఆర్ పేరు బేబీ కిట్లు
ఏపీలో ఎన్టీఆర్ పేరు బేబీ కిట్ల పథకాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టే పిల్లలకు బేబీ కిట్లు అందించాలని భావిస్తోంది. ఒక్కో ఎన్‌టీఆర్ బేబీ
ఏపీలో ఎన్టీఆర్ పేరు బేబీ కిట్ల పథకాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టే పిల్లలకు బేబీ కిట్లు అందించాలని భావిస్తోంది. ఒక్కో ఎన్‌టీఆర్ బేబీ కిట్ ధర రూ.1,400గా అంచనా వేసింది. NTR బేబీ కిట్ల కోసం ఏటా రూ.51.15 కోట్ల బడ్జెట్ కానుంది. ఏటా సుమారు 2.45 లక్షల మంది శిశువులకు ప్రయోజనం కలగనుంది. ఈ అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.