News5th Jul 12:50 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవిస్తే బేబీ కిట్లు
ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలని నిర్ణయించింది. 2016లో అప్పటి టీడీపీ ఈ బేబీ కిట్ల పంపిణీ పధకం అమల్ల
ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలని నిర్ణయించింది. 2016లో అప్పటి టీడీపీ ఈ బేబీ కిట్ల పంపిణీ పధకం అమల్లో ఉండేది. తర్వాత నిలిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బేబీ కిట్ల టెండర్ల బాధ్యతను ఏపీఎంఎస్‌ఐడీసీకి అప్పగించనుంది. రూ. 1410 విలువ చేసే ఈ బేబీ కిట్లలో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, న్యాప్కిన్స్,సబ్బు, పౌడర్ మొదలగు 11 వస్తువులు ఉంటాయి. వీటిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ చేయించుకున్న గర్భిణులకు అందించనున్నారు.