News1st Nov 03:49 PMSunil Byrisetty1 min read
ఎన్‌టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత
పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు దోహదం చేస్తున్నాయని.. జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చ
పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు దోహదం చేస్తున్నాయని.. జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఎన్‌టీర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ అర్బన్ పరిధిలోని ఖుద్దూస్ నగర్ - కేదారేశ్వరపేట ప్రాంతంలో అధికారులతో కలిసి లబ్దిదారులకు సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్లవద్దే అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు కూడా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్ల ద్వారా 2,29,381 మంది లబిద్దారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వివిధ క్యాటగిరీల పెన్షన్లకు సంబంధించి రూ. 99 కోట్ల 43 లక్షల మొత్తాన్ని లబ్దిదారులకు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.