News29th May 09:06 AMSunil Byrisetty1 min read
ఒకరోజు ముందుగానే పింఛన్లు!
రాష్ట్రంలో సాధారణ పింఛన్ల పంపిణీ ప్రతినెల ఒకటో తేదీన జరుగుతూ వస్తోంది. ఒకవేళ సెలవు రోజులు, పండుగలు వస్తే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఈసారి ఒకటో తేదీ ఆదివారం సెలవ
రాష్ట్రంలో సాధారణ పింఛన్ల పంపిణీ ప్రతినెల ఒకటో తేదీన జరుగుతూ వస్తోంది. ఒకవేళ సెలవు రోజులు, పండుగలు వస్తే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఈసారి ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయనున్నారు. జూన్ ఒకటిన ఆదివారం కావడంతో మే 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మే 31న ఉదయం ఏడు గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు ఇస్తారు. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మే 31న డబ్బులు తీసుకోలేకపోతే జూన్ రెండున సచివాలయం వద్దకు వెళ్లి.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు పింఛన్ తీసుకోవచ్చు.